ఈ మొక్కా మన గ్రామ శివార్లలో లేదా ఇంటి పరిసరాల్లో మనం చూడవచ్చు.ఈ మొక్క చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.ఈ మొక్క మీకు ఎక్కడ కనపడ్డా పిచ్చి మొక్క కదా అని పీకేయకండి.ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి.ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్క గురించి మరియు ఈ మొక్క ఉపయోగాలు గురించి చెప్పారు.
ఇక్కడ మనం ఈ మొక్క వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో చూద్దాం.
- కామెర్లకు
- ఉబ్బూకామెర్లకు
- స్త్రీల బట్టoట బట్టంటు రోగాలకు
- అతి పైత్యానికి
- కంటిలోని పూలకు
- ఎక్కిళ్లకు దగ్గుకు
- పుండ్లకు వ్రణాలకు
- ఋతుశూలకు ఋతుబద్ధానికి
- చర్మ రోగాలకు.
ఎక్కిళ్లకు దగ్గుకు
నేల ఉసిరి ఆకుల రసం ముక్కులలో రెండు మూడు చుక్కలు వేసుకొని లోనికి పీల పీలుస్తు వుంటే ఆశ్చర్యకరంగా ఎక్కిళ్ళు దగ్గు హరించిపోతాయి.
పుండ్లకు వ్రణాలకు
నేల ఉసిరి మొక్కలను సమూలంగా దంచి తీసిన రసంలో పసుపు కలిపి నూరి ఆ గుజ్జును రెండు పూటలా పుండ్ల పైన, గాయాలపైన, దెబ్బల పైన లేపనం చేస్తుంటే అవి చీముపట్టకుండా అతి త్వరగా మానిపోతాయి.